యజమాని ఆజ్ఞాపిస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు, పవన్ లపై విజయసాయి విమర్శలు
  • ట్విట్టర్ లో పరోక్ష వ్యాఖ్యలు
  • పావలా, ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. యజమాని ఆజ్ఞాపిస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు రాష్ట్ర బీజేపీని తన కనుసన్నల్లో నడిపించే ప్రయత్నాల్లో భాగంగానే ముందుగా పావలాను పంపించాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తన సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Pawan Kalyan
BJP
Telugudesam
Jana Sena

More Telugu News